![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -189 లో.. అనామిక కాఫీ షాప్ లో కలుస్తానని చెప్పగానే.. కళ్యాణ్ వెయిట్ చెయ్యలేక త్వరగా అనామికని కలవడానికి కాఫీ షాప్ కి బయల్దేరి వెళ్తాడు. కాఫీ షాప్ కి వెళ్ళగానే అందరూ అక్కడ కళ్యాణ్ కి వెల్ కమ్ చెప్తారు.. కానీ ఇంకా అప్పటికి అనామిక రాకపోవడంతో మళ్ళీ ఎప్పటిలాగే చేస్తుందని అనుకుంటాడు.
ఆ తర్వాత కళ్యాణ్ కాఫీ షాప్ లో అనామిక కోసం వెయిట్ చేస్తుంటాడు అనామిక తప్ప అందరు కళ్యాణ్ దగ్గరికి వచ్చి వెళ్తుంటారు. ఒక అమ్మాయి కళ్యాణ్ దగ్గరికి వస్తుంది.. తనే అనామిక అయి ఉంటుందా అని అడుగుతాడు. లేదు మేడమ్ వస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక ఆంటీ వస్తుంది. కొంపదీసి ఈవిడ అనామికనా అని భయపడుతాడు. ఆవిడా వచ్చి ఒక రోజ్ ఇచ్చి మీ కవిత్వం బాగుంటుంది. నేను అనామిక కాదు మేడమ్ వస్తున్నారని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక బామ్మ వస్తుంది. మళ్ళీ ఈవిడ అనామిక అయి ఉంటుందా అని అనుకొని బయపడతాడు. అప్పుడు ఆ బామ్మ వచ్చి రోజ్ ఇచ్చి.. మనవరాలు వస్తుందని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఎంత సేపు వెయిట్ చెయ్యాలో అని కళ్యాణ్ అనుకుంటాడు. మరొక వైపు రాజ్ తో సీతారామయ్య మాట్లాడుతాడు. నువ్వు కావ్యపై ప్రవర్తించే తీరుపై నాకు మీ కాపురం గురించి భయం వేస్తుంది. కావ్యకి పొగరని నువ్వు, మీ అమ్మ అనుకుంటున్నారు కానీ అది ఆత్మగౌరవమని ఎందుకు అనుకోవడం లేదని సీతరామయ్య అడుగుతాడు. మీరు ఇద్దరు కలిసి మెలిసి ఉంటేనే నేనే నిశ్చింతగా ఉంటానని సీత రామయ్య చెప్తాడు. కానీ రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు.
మరొక వైపు కళ్యాణ్ దగ్గరికి అనామిక వస్తుంది. అనామికని చూసిన కళ్యాణ్ ఫ్లాట్ అవుతాడు. అనామికతో ఉన్నప్పుడు అప్పు ఫోన్ చేస్తూనే ఉంటుంది. కళ్యాణ్ అప్పు ఫోన్ చెయ్యడం చూసి స్విచాఫ్ చేస్తాడు.. ఆ తర్వాత అనామికకి కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తాడు. అది చూసి అనామిక సంతోషపడుతుంది.. మరొక వైపు అందరూ భోజనం చేస్తూ వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సారి ఈ పూజ కావ్య చేస్తుందని ఇందిరాదేవి చెప్తుంది. అపర్ణ ఏమైనా అంటుందేమో అని కావ్య ఇబ్బందిగానే ఒప్పుకుంటుంది. మరొక వైపు కోపంగా ఉన్న అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చెయ్యకుండా స్విచాఫ్ చేసావని కళ్యాణ్ పై అప్పు అరుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |